రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ పేరు వారణాసి
హైదరాబాద్ః యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న మూవీ మొదటి అప్‌డేట్ వచ్చేసింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న మూవీ పేరు వచ్చేసింది. ఇప్పటికే లీక్ అయినట్లుగా ఈ చిత్రం పేరు వారణాసి అని ఒక చిన్న టీజర్ ద్వారా రాజమౌళి ప్రకటించారు. గ్లోబ్ ట్రోటర్ పేరుతో రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఈవెంట్‌లో మహేశ్‌బాబు మూవీ పేరు వారణాసిని ప్రకటించారు. సుమ యాంకర్‌గా వ్యవహరించిన ఈ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రియాంక చోప్రా, నటులు, టెక్నికల్ సిబ్బంది, మహేశ్‌బాబు సతీమణి, పిల్లలు పాల్గొన్నారు. వేలాది మంది మహేశ్ అభిమానులకు ప్రత్యేక పాసులు ద్వారా ఈ ఈవెంట్‌కు అనుమతినిచ్చారు. మహేశ్‌బాబు ఎంట్రీని ఒక వృషభంపై వచ్చినట్లుగా చూపించి ఆశ్చర్యపరిచారు. ఈ వారణాసి మూవీని దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నిర్మాతలుగా కె.ఎల్.నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ వ్యవహరిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. (Story: రాజమౌళి-మహేశ్‌బాబు మూవీ పేరు వారణాసి)


