Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ నుండి శ్రీశైలం వరకు మహా పాదయాత్ర

వినుకొండ నుండి శ్రీశైలం వరకు మహా పాదయాత్ర

0

వినుకొండ నుండి శ్రీశైలం వరకు మహా పాదయాత్ర

న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ పట్టణంలోని పాత శివాలయం నుండి మహా శివభక్తులు, శివస్వాముల బృందం శనివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం వరకు తమ మహా పాదయాత్రను భక్తి శ్రద్ధలతో బయలుదేరారు. ఆలయ పూజారి పచ్చజెండా ఊపి, ప్రత్యేక పూజలు నిర్వహించి దాదాపు 30 మందికి పైగా ఉన్న శివస్వాములు మరియు భక్తుల బృందాన్ని సాగనంపారు. శివనామస్మరణతో, భక్తి గీతాలతో ఆలయం ప్రాంగణం మార్మోగింది. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈ మహా పాదయాత్ర చేపట్టారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు, తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఈ కఠినమైన పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రలో పెమ్మసాని సోమశేఖర్, కాకర్ల నరసింహారావు, యార్లగడ్డ సాయి, న్యాయవాదులు కే ఎస్ ఎం వి నాయుడు, భావన రాంమోహన్ రావు, సిహెచ్ బ్రాహ్మం, తాడి శంకర్, శివ, పి. సత్తిబాబు, అయ్యప్ప స్వాములతో పాటు పలువురు శివ భక్తులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.(Story:వినుకొండ నుండి శ్రీశైలం వరకు మహా పాదయాత్ర)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version