ఘనంగా బాలల దినోత్సవం..
పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు నివాళులర్పించిన జీవి
న్యూస్ తెలుగు /వినుకొండ : బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం వినుకొండ పట్టణం లోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా జీవి మాట్లాడుతూ. పిల్లలకు చాచా నెహ్రూగా ఎంతో ఇష్టమైన జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు పిల్లలే పునాదులని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:ఘనంగా బాలల దినోత్సవం.. )

