గీతాంజలి గ్రౌండ్స్ నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక గీతాంజలి గ్రౌండ్స్ నందు బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ ఎండ్లూరి శేషగిరిరావు ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. స్వతంత్ర భారత ప్రదమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవ సందర్భంగా మనం బాలల దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నామని ఆయనకు చిన్నారులు అంటే ఎంతో ఇష్టమని కాబట్టి చిన్నారులు ఆయన తమపై చూపిన అభిమానానికి చిహ్నంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కాబట్టి చిన్నారులు బావి భారత పౌరులుగా ఎదగాలంటే మంచి లక్షణాలతో ఉన్నత విద్యలను అభ్యసించి భావి భారత పౌరులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని కోరారు. అటులనే చిన్నారులు మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అవ్వకుండా వాటిని పరిమితంగా వాడి కేవలం జ్ఞాన సమపార్జన కోసమే వినియోగించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుకు మొబైల్ ఫోన్లను వాడకుండా తమను తాము నియంత్రించుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా చూపర్లను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story:గీతాంజలి గ్రౌండ్స్ నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు)

