కార్యకర్తలే టీడీపీకి మూల స్తంభాలు..
– ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలి
– స్థానిక సంస్థల ఎన్నికలకు మరో మారు నడుం బిగించాలి
– ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, పొలిట్ బ్యూరో వ పొలిట్ బ్యూరో రామయ్య
న్యూస్ తెలుగు /వినుకొండ : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలని, కార్యకర్తలకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యలు అన్నారు. స్థానిక గంగినేని కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన వినుకొండ నియోజకవర్గలోని పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ మరియు బూత్ స్థాయిల నూతన కమిటీ బాధ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా చీఫ్ విప్ జీవి, వర్ల రామయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ వైసిపి అరాచక పాలనను తరిమికొట్టడంలో టిడిపి శ్రేణులు ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేసి తప్పుడు కేసులు పెట్టిన ఎదురెడ్డి నిలిచి ఈ రాష్ట్రం నుంచి అరాచక శక్తులను తరిమికొట్టడంలో కార్యకర్తల పాత్ర మరువలేనిదన్నారు. అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజాసేవకు అంకితమై చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, గత ఐదేళ్ల వైసిపి పాలనలో రౌడీయిజం గుండాయిజంతో విర్రవీగి అనేక అరాచకాలకు పాల్పడితే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. తనపై ఎంతో నమ్మకముతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపుకు కృషిచేసిన టిడిపి కార్యకర్తలకు రుణపడి ఉన్నానని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని అన్నారు. తన జీవితం ప్రజాసేవకు అంకితమై పని చేస్తానని, నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రతి శుక్రవారం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నానని, ఇకనుండి వారానికి మూడు రోజులు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఎన్ఎస్పి స్థలం అభివృద్ధి, శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం, ఘాట్ రోడ్డు నిర్మాణం తోపాటు నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా నిలుస్తానని, సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. వివిధ కమిటీల బాధ్యులచే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి టిడిపి నేతలు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన ప్రజలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మానుకొండ వరప్రసాద్, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, సొసైటీ ప్రెసిడెంట్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:కార్యకర్తలే టీడీపీకి మూల స్తంభాలు..)

