Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శుక్రవారం వినుకొండ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

శుక్రవారం వినుకొండ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

శుక్రవారం వినుకొండ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

న్యూస్ తెలుగు/ వినుకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన పార్టీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం ఉదయం 9:00 గంటలకు వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి, వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ , ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, విలేజ్, మరియు బూత్ స్థాయి, గ్రామ/వార్డు అధ్యక్షులు, గ్రామ/వార్డు అనుబంధ కమిటీల , మండలా అనుబంధ కమిటీలు , నియోజకవర్గ అనుబంధ కమిటీలు బాధ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నూతన కమిటీలను నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పసుపు చొక్కాలతో తరలిరావాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మరియు అభిమానులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు చొక్కా ధరించి హాజరు కావాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.(Story:శుక్రవారం వినుకొండ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!