సత్య కళాశాల విద్యార్థి కి బాక్సింగ్ లో రజిత పతకం
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంటర్ కాలేజియేట్ బాక్సింగ్ పోటీల లో సత్య డిగ్రీ , పీజీ కళాశాల డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థి చైతన్య ద్వితీయ స్థానాన్ని పొంది రజిత పతకం సాధించాడు.
విద్యార్థుల కృషి, కోచ్‌ల మార్గదర్శకం, కళాశాల నిర్వహణ సహకారం ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయి అని కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు అన్నారు.
ఈ సందర్భం గా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి జాతీయ స్థాయి పోటీల్లో మరింత విజయాలు సాధించాలని ఆశిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సి సి ఆఫీసర్లు కెప్టెన్ ఎం సత్య వేణి, లెఫ్టినెంట్ ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరప నాయుడు అధ్యాపకులు విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. (Story:సత్య కళాశాల విద్యార్థి కి బాక్సింగ్ లో రజిత పతకం)

