Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫార్మసీ రంగంలో టెక్నాలజీ జోడించి మెరుగైన ఉపాధి

ఫార్మసీ రంగంలో టెక్నాలజీ జోడించి మెరుగైన ఉపాధి

ఫార్మసీ రంగంలో టెక్నాలజీ జోడించి మెరుగైన ఉపాధి

జేఎన్టీయూ వై ఛాన్స్లర్ వివి సుబ్బారావు
విజయనగరంలో జేఎన్టీయూ ఫార్మసీ కోర్స్ ప్రారంభం
విద్యార్థులు ఆహ్వానం పలికిన రిజిస్ట్రార్ జయ సుమా
ఔషదాయాల తయారులో ఉత్తరాంధ్ర హబ్
ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈశ్వర్ కుమార్

న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాఉపాధి అవకాశాలుతగ్గిపోతున్నాయని, అయితే ఫార్మసీరంగంలో టెక్నాలజీని జోడించి, స్వతహాగా విద్యార్థులును తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆ విధంగా ఫార్మసీ కోర్సును తీర్చిదిద్దుతామని విజయనగరం జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి .వి సుబ్బారావు తెలిపారు.. గురువారం జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ బ్రాంచ్ ప్రారంభించారు. ఇందులో బీఫార్మసీ కోర్సును ఆయన లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులను స్వాగతించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమాజంలో ఔషధ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశ విదేశాల్లో ఫార్మసీ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవల కోవిడ్ సమయంలో భారతదేశం ఉత్పత్తి అయిన ఫార్మసీ ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలు గుర్తించాయని కొనియాడారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దొర కొన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అన్నారు
గౌరవ అతిథి గా విచ్చేసిన యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ జయసుమ మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థుల ప్రతిభను నిరూపించుకొని పోటీతత్వంతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మసిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఫార్మసీ విభాగం ప్రత్యేక హబ్ గా ఉందని ఉపాధి అవకాశాలకు యొక్క ప్రాముఖ్యతను, ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడానికి కారణాలను వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఫార్మసీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్, మరియు సిబ్బందిఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ డైరెక్టర్స్ ప్రొఫెసర్ కే.సి.బీ రావు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రాజేశ్వరరావు, వైస్ఋ ప్రిన్సిపాల్ జి.జే .నాగరాజు, ,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. (Story:ఫార్మసీ రంగంలో టెక్నాలజీ జోడించి మెరుగైన ఉపాధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!