Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం

0

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని పెద్ద కంచర్ల గ్రామంలో వ్యవసాయ శాఖ శాఖ ఆధ్వర్యంలో గురువారం సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి. వరలక్ష్మి రైతు సోదరులకు ఎలుకల వల్ల వరి పంటకు జరుగు నష్టం గూర్చి వివరించారు. ఎలుకలు వాటి దంతాలు పెరగకుండా పైరుని కట్ చేస్తాయని దాని వలన రైతులకు అపారమైన నష్టం చేకూరునని తెలిపారు. వరి నూక 96 పాళ్లు,మంచి నూనె రెండు పాళ్ళు, బ్రోమోడైయొలిన్ రెండు పాళ్ళు కలిపిన విషపు ఎర్రను ప్యాకెట్లుగా తయారు చేసి ఎలుక బొరియల దగ్గర వేయటం ద్వారా సామూహిక ఎలుకల నిర్మూలన చేయబడుతుందని తెలిపారు. విషపు ఎర ప్యాకెట్లు తయారుచేసి రైతు సోదరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఆరిఫ్, రైతు సేవా కేంద్ర సిబ్బంది యశ్వంత్ రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎలుకల నిర్మూలన కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version