Home వార్తలు సైబర్ భ‌ద్రతా సవాళ్లపై డిడాక్ ఇండియా 2025లో 20 దేశాల కంపెనీలు, నిపుణులు

సైబర్ భ‌ద్రతా సవాళ్లపై డిడాక్ ఇండియా 2025లో 20 దేశాల కంపెనీలు, నిపుణులు

0

సైబర్ భ‌ద్రతా సవాళ్లపై డిడాక్ ఇండియా 2025లో 20 దేశాల కంపెనీలు, నిపుణులు

న్యూదిల్లీ : దేశంలో డిజిటల్ మార్పు సైబర్ దాడుల పెరుగుదలకు దారితీసింది. ఇప్పుడు ప్రతిసంస్థ సగటున వారంలో 7095 కంటే ఎక్కువ దాడులను ఎదుర్కొంటోంది. ఒక్క ఆగస్టులోనే దేశీయ విద్యాసంస్థలు సైబర్ దాడుల సంఘటనలలో సంవత్సరానికి 13% పెరుగుదలను చవిచూశాయి. డేటా ఉల్లంఘనలు, రాన్సమ్ వేర్ మొదలుకొని ఫిషింగ్, సిస్టమ్ ష‌ట్‌డౌన్‌ల వరకు సైబర్ దాడులు జరిగాయి. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి, డిడాక్ ఇండియా 2025 దేశవ్యాప్తంగా విద్యాసంస్థలలో సైబర్ భ‌ద్రతను బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చెందుతోంది. 30కి పైగా ప్రముఖ కంపెనీలు, 20 దేశాల నుండి 50 మందికి పైగా నిపుణులు విద్యా సంస్థల్లో సైబర్ భ‌ద్రతా సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించారు. ఆసియాలో అతిపెద్ద, భారతదేశ ఏకైక విద్యారంగ ప్రదర్శన, సమావేశం అయిన డిడాక్ ఇండియా 15వ ఎడిషన్‌ను ప్రపంచంలోని ప్రముఖ వాణిజ్య ప్రదర్శన కంపెనీలలో ఒకటైన మెస్సేస్టట్‌గార్ట్, విద్య, నైపుణ్యాల కోసం కృషి చేస్తున్న ఇండియా డిడాక్టిక్స్ అసోసియేషన్ (ఐడీఏ) భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భవిష్యత్ నైపుణ్యాలు, శ్రామికశక్తి సంసిద్ధత, వృత్తిపరమైన నైపుణ్యాలపై ఆసియాలో మొట్టమొదటి ప్రదర్శన, సమావేశం డిడాక్ స్కిల్స్ కూడా ప్రారంభమవుతుంద‌ని మెస్సేస్టట్‌గార్ట్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ సూద్ అన్నారు. (Story:సైబర్ భ‌ద్రతా సవాళ్లపై డిడాక్ ఇండియా 2025లో 20 దేశాల కంపెనీలు, నిపుణులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version