Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రైతులకు అవగాహన కార్యక్రమం

రైతులకు అవగాహన కార్యక్రమం

రైతులకు అవగాహన కార్యక్రమం

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ మండలంలోని అందుగులపాడు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటల మీద యాజమాన్య పద్ధతుల గూర్చి శిక్షణ తరగతి నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జి వరలక్ష్మి మాట్లాడుతూ రైతు సోదరులు కంది వేసే ముందు ట్రైకోడెర్మా విరిడి ఎకరానికి నాలుగు కిలోలు పశువుల ఎరువులు మాగబెట్టి దుక్కులో చల్లాలని తద్వారా ఎండు తెగులు ఆశించకుండా పైరు ని కాపాడుకోవచ్చు అని తెలియజేశారు .ఏడీఏ (రిటైర్డ్) జ్యోతి ప్రసాద్ మాట్లాడుతూ రైతు సోదరులు మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పెట్టుబడి తగ్గించుకోవచ్చని భూమి సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఆరిఫ్, వి.హెచ్ .ఎ నారాయణ రైతు సోదరులు పాల్గొన్నారు.(Story:రైతులకు అవగాహన కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!