Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛ సర్వే క్షణన్ లో శిక్షణ..

స్వచ్ఛ సర్వే క్షణన్ లో శిక్షణ..

స్వచ్ఛ సర్వే క్షణన్ లో శిక్షణ..

న్యూస్ తెలుగు / వినుకొండ : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వినుకొండ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ లోని మెప్మా రిసోర్స్ పర్సన్ కు ఒక రోజు వ్యర్ధాలను వేరు చేయడం, తడి చెత్తను కంపోస్ట్ గా మార్చడం, ఆ కంపోస్ట్ ను తిరిగి టెర్రస్ గార్డెన్ అనే అంశాలు స్వచ్ఛ సర్వే క్షణన్ లో శిక్షణ ఇవ్వడమైనది.
వినుకొండ నగరపాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ హాల్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన మరియు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అంశాలపై ఒక్కరోజు పూర్తిస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుండి శిక్షకులుగా వెంకటేశ్వరరావు, తిరుపతి రావు, పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ శివ పార్వతి, నాయక్ విజయవాడ నుండి వచ్చి శిక్షణను ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మునిసిపల్ ఛైర్ పర్సన్ షేక్. షకీలా పాల్గొని మాట్లాడుతూ. వినుకొండ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ లో గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం లో భాగంగా అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవ సందర్బంగా మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఒక మామిడి మొక్కను నాటటం జరిగింది. కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. ఆర్పీ. లు అంకిత భావం తో ఈ కార్యక్రమం లో పాల్గొని మంచి గుర్తింపు పొందేలా పని చేయాలి అని సూచించారు.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ శిక్షకులు వెంకటేశ్వరరావు శిక్షణ తరగతుల ప్రారంభిస్తూ ప్రతి ఆర్.పి తమ సామర్థ్యాలను ఎల్లవేళలా మెరుగుపరుచుకోవాలన్నారు. బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుంటూ తన వృత్తిలో తమదైన ముద్రను వేసుకోవాలని, అందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని, కావున ఈ శిక్షణ తరగతులు వినియోగించుకోవాలన్నారు. అలాగే వివిధ అంశాలపై చర్చా కార్యాక్రమం, ప్రదర్శనా నమూనా లో అత్యంత ఆసక్తి దయాకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను విజయవాడ నుండి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి, ఆర్డిఎంఏ, సిడియమ్యె యూట్యూబ్ లైవ్ సహాయంతో ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి కార్యదర్శులకు స్వచ్ఛభారత్, స్వచ్చ వినుకొండ కొరకు దిశా నిర్దేశం చేశారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ నిర్మూలన మరియు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అంశాలపై ఒక్కరోజు పూర్తిస్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుంటూ తన వృత్తిలో తమదైన ముద్రను వేసుకోవాలని, అందుకు ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని కావున ఈ శిక్షణ తరగతులు వినియోగించుకోవాలన్నారు. అలాగే వివిధ అంశాలపై చర్చా కార్యాక్రమం, ప్రదర్శనా నమూనా లో అత్యంత ఆసక్తి దయాకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో పల్నాడు డిస్టిక్ కోఆర్డినేటర్ శివ పార్వతి, ఏకాంత్ నాయక్ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగి తమ సమర్థ్యలను స్వచ్ఛతపై ఎల్లవేళ్లేలా మెరుగుపరుచుకోవాలన్నారు.(Story:స్వచ్ఛ సర్వే క్షణన్ లో శిక్షణ..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!