పిట్టంబండ గ్రామాలలో పొలం పిలుస్తుంది
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ మండలం లోని ఉమ్మడివరం పిట్టంబండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి జీ వరలక్ష్మి మాట్లాడుతూ. వరి వేసిన రైతులు అగ్గి తెగులు ఆశించకుండా ఎకరానికి భావిస్టిన్ 250 గ్రాములు పిసికారీ చేయాలని, అగ్గి తెగులు ఆశించిన పోలానికి 120 గ్రాములు ట్రై సైక్లోజోల్+బావిస్టిన్ , 250 గ్రాములు పిచికారి చేయాలని, తద్వారా మాను కాయ తెగులు కూడా ఆశించకుండా పైరును కాపాడుకోవచ్చని అన్నారు. ఉల్లి కోడు ఆశించిన వరి పొలానికి ఎకరాకు కెరటాఫ్ హైడ్రోక్లోరైడ్ గు లికలు, 8 కేజీలు లేక ఫోరేట్ గుళికలు నాలుగు కేజీలు నీరు తీసివేసి చల్లాలని లేదా కెరటాఫ్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు పొడిని పిచికారి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ఆరిఫ్, సచివాలయ సిబ్బంది దుర్గ వరప్రసాద్ నాయక్, రైతు సోదరులు పాల్గొన్నారు.(Story : పిట్టంబండ గ్రామాలలో పొలం పిలుస్తుంది )
