Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ టిడిపి కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కును అందజేసిన ప్రభుత్వ

టిడిపి కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కును అందజేసిన ప్రభుత్వ

0

టిడిపి కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కును అందజేసిన ప్రభుత్వ

న్యూస్ తెలుగు/వినుకొండ  : టిడిపి కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీమా సౌకర్యాన్ని కల్పించడం హర్షనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బొల్లాపల్లి మండలం మూగచింతల పాలెం గ్రామానికి చెందిన పాలడుగు నాగేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించగా టిడిపి పార్టీ భీమా ద్వారా అందించిన 5 లక్షల రూపాయలు చెక్కును చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మృతుని కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలడుగు నాగేశ్వరరావు పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటే అండగా నిలిచారని అటువంటి కార్యకర్త నాగేశ్వరరావు మరణం పార్టీకి తీరని లోటని అని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ప్రమాద భీమా చేయటం వలన ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకుందన్నారు. పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.(Story   :  టిడిపి కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కును అందజేసిన ప్రభుత్వ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version