నిరుపేద కుటుంబానికి రూ 7 లక్షల LOC
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా ఘణపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన రాజేష్ గారి రెండు సంవత్సరాల కుమారుడు అభిదేవ్ చెవిటి, మూగ ఉన్నాడని గుర్తించారు. ఈ క్రమంలో బాలుడికి చికిత్స చేయించడం కోసం తమ ఆర్థిక పరిస్థితి సరిపోవడం లేదని మాకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూ బాలుడి కుటుంబ సభ్యులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బాలుడి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దృష్టి సాధించిన ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి 7 లక్షల రూపాయల LOC నీ మంజూరు చేయించారు. ఈ నేపద్యంలో మంజూరైన LOC నీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ కుటుంబా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమ బిడ్డ ఆరోగ్య నిమిత్తం 7 లక్షల రూపాయల LOC నీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి కి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మనాజిపేట మాజీ సర్పంచ్ సతీష్, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. (Story:నిరుపేద కుటుంబానికి రూ 7 లక్షల LOC)

