ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ
న్యూస్‌తెలుగు/వనపర్తి : విద్యాపత్తిగా పేరెన్నిక గన్న వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల కు సంబంధించి బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ . రూ 13.15 కోట్లు మంజూరు చేసినట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలు పెంచి ఇవ్వడంతో పాటు, ప్రతి విద్యాలయానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తూ వస్తుంది ఈ క్రమంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలో గల వసతి గృహానికి సంబంధించి బాలుర బాలికల నూతన వసతి గృహాల నిర్మాణాలకు నేడు నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధుల మంజూరు కి సహకరించిన ఇంచార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ కి, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కి, వాకిటి శ్రీహరి కి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. (Story:ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ)
