కోర్టు లలో పెండింగ్ లొ వున్నా కేసుల పరిష్కారం కొరకు స్పెషల్ లోక్ అదాలత్
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లా లొని అన్ని పోలీస్ స్టేషన్స్ అధికారులు, జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ గారితో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా వున్న అన్ని కోర్టు లలో పెండింగ్ లొ వున్నా క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మైంటెనెన్సు కేసులు, గృహహింస చట్టం క్రింద నమోదైన కేసులు, ప్రమాద భీమా క్లెయిమ్ కేసులు, సివిల్ కేసుల పరిష్కారం కొరకు స్పెషల్ లోక్అదాలత్ ఈ నెల 15.11.2025 నాడు నిర్వహించడం జరుగుతుంది ఆని కావున కక్షిదారులు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలను మరియు మండల న్యాయ సేవా సమితులను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ నిర్వహించమని ఆదేశించటం జరిగిందని వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, వనపర్తి కోర్టులలో పెండింగ్ లొ వున్నా కేసులను విభాగల వారీగా విభజించి వాటిలో రాజీకి అనుకూలంగా వున్నా ——– కేసులను గుర్తించడం జరిగిందని శ్రీమతి వి. రజని, జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వనపర్తి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లొ మధ్యవర్తిత్త్వం ద్వారా కూడా కేసుల పరిష్కారం కొరకు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతేకoగా నియమించిన మధ్యవర్తుల ద్వారా కేసులలో వున్నా కక్షిదారులతో మాట్లాడి పరిష్కారం కొరకు కృషి చేస్తారని తెలిపారు. మధ్యవర్తిత్వం అనేది ఇరుపక్షాలు వారి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి మరియు వేగమంతమైన తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, ఇందులో ఇరు వర్గాలకు విజయం వర్తిస్తుందని డాక్యుమెంట్స్ సుదీర్ఘ కోర్టు పోరాటాలు ఉండవని ఇరువర్గాలు మాత్రమే మాట్లాడుతారు కానీ వారి ప్రతినిధులు కారని, ఇరు పార్టీల సమ్మతితోనే పరిష్కారం జరుగుతుందని తెలియజేశారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లొ భాగంగా గుర్తించబడిన కేసులలో ఇరువర్గాలకు నోటీసులని పంపించి లోక్ అదాలత్ ఎదుట హాజరు కమ్మని తెలియజేయడం జరుగుతుందని, కావున కక్షిదారులు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రజని, సీనియర్ సివిల్ జడ్జ్ మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, వనపర్తి, కార్తీక్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి, DSP వెంకటేశ్వర్రావు, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. (Story:కోర్టు లలో పెండింగ్ లొ వున్నా కేసుల పరిష్కారం కొరకు స్పెషల్ లోక్ అదాలత్)

