విజిలెన్స్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు
న్యూస్ తెలుగు /చింతూరు :
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో సోమవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా “అప్రమత్తత – మన అందరి బాధ్యత” అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిధిగా విచ్చేసిన చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు అప్రమత్తంగా మెలిగి సామాజిక బాధ్యతగా అవినీతి, నేరాలు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు తమ దృష్టికి వచ్చినట్లయితే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వివిధ సెక్షన్ల గురించి, నేరాల నిరూపణ ప్రక్రియలు, జరిమానాలు, జైలు శిక్షలు గూర్చి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్. ప్రిన్సిపల్ ఎమ్.శేఖర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్.అప్పనమ్మ , డాక్టర్ వై.పద్మ, డాక్టర్ కె.శకుంతల, జి.హారతి, కె.శైలజ, బి.శ్రీనివాసరావు, ఎన్.ఆనంద్, కె.లక్ష్మీ ప్రసన్న కుమారి, మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. (Story:విజిలెన్స్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు)

