Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ భారత్ మహిళల వరల్డ్ కప్ విజయం కోసం దేవాలయం, మసీదులలో, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..

భారత్ మహిళల వరల్డ్ కప్ విజయం కోసం దేవాలయం, మసీదులలో, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..

0

భారత్ మహిళల వరల్డ్ కప్ విజయం కోసం దేవాలయం, మసీదులలో, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..

న్యూస్ తెలుగు / వినుకొండ : భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతిష్టాత్మకమైన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, వినుకొండ పట్టణంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు దేవాలయ పూజారులు, నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. భారత జట్టు వరల్డ్ కప్‌ను గెలవాలని స్వామివారిని వేడుకున్నారు. అదేవిధంగా, పట్టణంలోని ప్రధాన మసీదులో కూడా మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీడాకారిణులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.(Story:భారత్ మహిళల వరల్డ్ కప్ విజయం కోసం దేవాలయం, మసీదులలో, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version