Homeవార్తలు ‘వసుదేవసుతం’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

 ‘వసుదేవసుతం’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

 ‘వసుదేవసుతం’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు.
‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే ఈ  పాటను ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల  గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఇక తెర అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. కొరియోగ్రాఫీ కూడా ఎంతో చక్కగా కుదిరినట్టు కనిపిస్తోంది.
*పాటను రిలీజ్ చేసిన అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ..* ‘వసుదేవసుతం’ మూవీలోని ‘వసుదేవసుతం దేవం’ అనే పాట చాలా బాగుంది. టీం అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.
*తారాగణం:* మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు
*సాంకేతిక సిబ్బంది:*
రచయిత & దర్శకుడు : వైకుంఠ్ బోను
నిర్మాత : ధనలక్ష్మి బాదర్ల
బ్యానర్ : రెయిన్‌బో సినిమాస్
సంగీతం : మణిశర్మ
DOP : జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
లిరిసిస్ట్ : చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్ : రామకృష్ణ
కోరియోగ్రాఫీ: అజయ్ సాయి
పీఆర్వో : సాయి సతీష్ (Story: ‘వసుదేవసుతం’ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!