పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఘన నివాళి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మాతృభాష, మాతృరాష్ట్రం కోసం ప్రాణాలు సైతం అర్పించిన మహాత్యాగి పొట్టి శ్రీరాములు త్యాగం దేశ చరిత్రలో చిరస్మరణీయం, ఆయన నిరాహార దీక్ష, సంకల్పం కారణంగానే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని, ఆయన త్యాగస్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.(Story :పొట్టి శ్రీరాములుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఘన నివాళి )
