పట్టణంలో గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పట్టణంలో స్థానిక శంకరమఠం సమీపంలో అందరికీ ఆరోగ్యం పంచాలని ఉద్దేశంతో గ్లోబల్ వెల్నెస్ సెంటర్ శుక్రవారం జనసేన పార్టీ నాయకులు పాలవలస యశస్విని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణ ప్రధాన ధ్యేయంగా గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించమని ప్రోపరేటర్ ఝాన్సీ శంకర్రావు తెలియజేశారు.ఈ గ్లోబల్ వెల్ నెస్ సెంటర్ లో షేక్ కౌంటర్, కాష్ కౌంటర్, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జనసేన నాయకులు అవనపు విక్రం చేతులు మీదుగా చెకప్ కౌంటర్లు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో వెల్ నెస్ 23 సెంటర్లు ఉండగా 24 సెంటర్ ను ప్రారంభించడం.ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పట్టణ ప్రజలంతా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ ట్రైనిర్ రామ్ దంపతులు, సంతోషం టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సంతోషి కుమారి, ప్రముఖ వెల్ నెస్ ట్రైనర్లు న్యూట్రిషన్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. (Story:పట్టణంలో గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం)

