‘మొంథా’ తుఫాను నష్టంపై అధికారులతో పరిశీలించిన
న్యూస్ తెలుగు/వినుకొండ : ‘మొంథా’ తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గురువారం నాడు నూజెండ్ల మండలంలో పర్యటించి పరిశీలించారు. పువ్వాడ గ్రామంలో తుఫాన్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లను సందర్శించి నీటి ప్రవాహానికి కోతకు గురైన రోడ్లు మరమ్మతుల ప్రభుత్వానికి నివేదించాలని చీఫ్ విప్ జీవి అధికారులను ఆదేశించారు. వర్షానికి, ఈదురు గాలులకు తెగిపోయిన కరెంటు తీగలు, విరిగిన, ఒరిగిన కరెంటు స్తంభాలను ఆయన పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు నేలకు వరికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయి గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపతిన మరమ్మత్తులు చేయించి గ్రామాలకు కరెంటు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప్పలపాడు, తలార్లపల్లి, గొల్లపాలెం, గ్రామాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : ‘మొంథా’ తుఫాను నష్టంపై అధికారులతో పరిశీలించిన )

