Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ

0

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ

న్యూస్ తెలుగు/వినుకొండ  : పాఠశాలల్లో తక్షణం కావలసినవి, చిన్నవి అయిన కొన్ని అవసరాల విషయంలో ప్రభుత్వం వరకు పోకుండా స్వచ్చంద సంస్థలు కొన్ని స్పందించి సమకూర్చుతాయని రోటరీక్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ కూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ అవసరాల ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు ఏరువ వెంకట నారాయణ అన్నారు. స్థానిక ఎన్ఎస్పి కాలనీ, జెడ్ పి హైస్కూల్ నందు క్లబ్ సభ్యుల సౌజన్యం తో రోటరీ క్లబ్ వారు ఇటీవల కాలంలో జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలలో రాణించి మెడల్స్ సాధించిన శావల్యాపురం మండలానికి చెందిన 5 గురు క్రీడాకారిణులకు ఒక్కొక్కటి 5000 రూపాయల విలువ కలిగిన బాల్ బాడ్మింటన్ కిట్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ బాజీ, కోశాధికారి పొత్తూరి నవీన్ , క్లబ్ జిల్లా ముఖ్యులు ఆలా శ్రీనివాసరావు , చిరుమామిల్ల కోటేశ్వరరావు, క్లబ్ డైరెక్టర్ లు గుమ్మా శ్రీకాంత్ రెడ్డి , షేక్ మస్తాన్ , గుత్తా గురునాధం , కూచి రామాంజనేయులు, క్లబ్ సభ్యులు నాగేంద్రుడు మాష్టారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వీరప్పయ, పద్మజ మేడం, క్రీడా శిక్షణను ఇస్తున్న రాధాకృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.(Story :రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా కిట్లు పంపిణీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version