తుఫాన్ బాధితులకు సహాయం చేయాలని సిపిఐ నేతల వినతి పత్రం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల 28, 29 తారీకుల్లో కురిసిన మొంథా తుఫాన్ వల్ల పూర్తిగా ఇల్లు మునిగిపోయి ఆర్థికంగా నష్టపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వినుకొండ మండలం విఠంరాజు పల్లి పంచాయతీ వయ్యకంటి శివప్రసాద్ ఎస్టి కాలనీ వాసులను ప్రభుత్వం ఆదుకొని, ఆర్థిక సహాయం చేయాలి అని గురువారం సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో వినుకొండ మండల తాసిల్దార్ సురేష్ నాయక్ కి కాలనీవాసులతో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, వినుకొండ మండల పార్టీ కార్యదర్శి కొప్పురప్ప మల్లికార్జున, వయ్యకంటి శివప్రసాద్ కాలనీ వాసులు సిహెచ్. నాగరాజు, అంకమ్మరావు, చిన్నారి, మార్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.(Story :తుఫాన్ బాధితులకు సహాయం చేయాలని సిపిఐ నేతల వినతి పత్రం )

