కౌన్సిలర్లు అంటే గౌరవం లేదా…???
గాంధీ విగ్రహాం శిలాఫలకంపై కౌన్సిలర్ల పేర్లు ఎందుకు ప్రచురించలేదు…!!!
పెట్రోలు బంకు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం, ప్రజలు తీవ్ర ఇక్కట్లు
నరసరావుపేట రోడ్డులో ఇరువైపుల అక్రమణలు తోలగించకుండా… డ్రైనేజీ లు, డివైడర్ల నిర్మాణం ఎందుకు…???
అక్రమణలు తొలగించడంలో అధికారులు విఫలం చేందారని… కౌన్సిలర్లు విమర్శలు.
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పురపాలక సంఘం సాధారణ సమావేశం ఛైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పొల్గొన్న పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ. పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల పెట్రోలు బంకు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్ వల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇరువైపులా అక్రమణలు తొలగించకుండా, డివైడర్, డ్రెయినేజీ నిర్మించి ఏమి ప్రయోజనమని అధికారులను ప్రశ్నించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న అక్రమణలు తొలగించడంలో అధికారులు విఫలం చెందారని విమర్శించారు. అక్రమణల తొలగింపులో బాగం అంటూ ఏంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మ గాంధీ విగ్రహాన్ని తొలగించారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో, 4 లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో నూతన విగ్రహాం ఏర్పాటు చేసారు. శిలాఫలకం పై కౌన్సిలర్ల పేర్లు ఎందుకు వేయలేదని, కౌన్సిలర్లు అంటే గౌరవం లేదా అని అధికారులను ప్రశ్నించారు. మహాత్మ గాంధీ అందరి వాడని ఏ ఒక్క వర్గానికి చెందిన వాడు కాదని, గాంధీ ని గౌరవించుకోవడం మనందరి బాధ్యతని, అందుకని గాంధీ కాంస్య విగ్రహాన్ని మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరారు.(Story :కౌన్సిలర్లు అంటే గౌరవం లేదా…??? )
