Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

మరొకరికి తీవ్ర గాయాలు

న్యూస్ తెలుగు /వినుకొండ : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన వినుకొండ సమీపంలోని బాలాజీ ఎస్టేట్ వద్ద చోటు చేసుకుంది…వివరాల్లోకి వెళ్తే వినుకొండ పట్టణంలోని ఇసుకవాగు బజార్ లో నివాసం ఉంటున్న ఉప్పలపాటి రామాంజనేయులు, కార్తీక్ అన్నదమ్ములు వ్యక్తిగత పనుల నిమిత్తం శావల్యాపురం వైపు వెళ్తుండగా బాలాజీ ఎస్టేట్ సమీపంలో వేగంగా వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి వినుకొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో రామాంజనేయులు మృతి చెందగా అతని తమ్ముడు కార్తీక్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడు నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. వినుకొండలో నివాసం ఉంటున్నారు. (Story:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!