ఆధారాలు ఉంటే ఎవరిపై అయినా చర్యలు తీసుకుంటాం
జీవీ, లావుపై ఆరోపణలు చేస్తే బొల్లా మొహంపైనే పడుతుంది
స్మగ్లింగ్, భూకబ్జాలు, అవినీతిపై ఎదిగిన వ్యక్తి బొల్లా
2014లో డిగ్రీ,, 2019లో నిశానీ చెప్పింది మరిచిపోతే ఎలా
న్యూస్ తెలుగు/వినుకొండ : కూటమి ప్రభుత్వం, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న అర్థరహిత, అసంబద్ధ ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు హెచ్చరించారు. వేలిముద్ర తప్ప ఏమీ తెలియన లారీ క్లీనర్ నుంచి అడ్డదారుల్లో ఎదిగిన బొల్లాకు వయసు పెరిగింది తప్ప బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో బొల్లా ఏం చేశాడు? తాను, జీవీ ఎమ్మెల్యేలుగా వినుకొండకు ఏం చేశామో ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వినుకొండలో బొల్లా చేసిన ఆరోపణలపై గురువారం ఈ మేరకు మీడియాతో మా ట్లాడారు జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన. తమ కుటుంబంలో చేపల వ్యాపారంలో 50ఏళ్ల నుంచీ ఉం దని ఆ విషయం తానెక్కడా దాచ లేదన్నారు. అదనంగా ఆవుల పెంపకం, సేంద్రీయ వ్యసా యం, వ్యాపారాలతో ఏం చేసినా న్యాయబద్ధంగా సంపాదిస్తున్నామన్నారు. బొల్లాలా కప్పల స్మ గ్లింగ్ చేసి, అడ్డొచ్చిన వారిని లారీలతో తొక్కించి, 6 రూపాయల వడ్డీవ్యాపారాలతో ప్రజల రక్తం, పీల్చి, కనబడిన భూములనల్లా కబ్జా చేసి ఎదగలేదన్నారు. 4సార్లు పార్టీ మారిన బొల్లా తనపై పార్టీ మారనంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎరువులు లేవని, సొసైటీల్లో ఏదో జరిగిందని, గుండ్లకమ్మలో ఇసుక అక్రమాలని, ఆస్పత్రుల్లో మందులు అమ్ముకున్నారని రోజుకో ఆరోపణ చేస్తున్న బొల్లా ఒక్కదానికైనా ఆధారాలు చూపించారా అని మండిపడ్డారు. తిరుమల మిల్క్ డైరీ బొల్లా డైరెక్టర్ గా ఉన్న సమయంలో కల్తీ పాలు కేసులో కోర్టు చుట్టూ తిరిగింది నిజం కాదా అని మక్కెన ప్రశ్నించారు. అలాగే ఆనాడు గ్రామాలలో పాలు సేకరించి కేంద్రాలలో తక్కువ శాతం వేసి స్త్రీ శక్తిని దోచుకుంది అందరికీ తెలుసు అన్నారు. ఇదే బొల్లా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దొండపాడు చెరువుల విషయంలో జేవీఎస్ సంస్థను బెదిరించి రూ.5కోట్లు వసూలు చేశారని, బాధితులు మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు. కొండ వద్ద భూముల ఆక్రమణ, ఏబీఎం కాంపౌండ్లు భూముల కొనుగోలు, తిరుమల సంస్థపై వచ్చిన ఆరో పణలపై కావాలంటే ఆధారాలు చూపిస్తామన్నారు. 2014లో డిగ్రీ చదివా అని అఫిడవిట్ ఇచ్చిన బొల్లా 2019లో ఏం చదవలేదని పేర్కొన్నారని, అలాంటి వ్యక్తి తన డిగ్రీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటూ తన నాగార్జున వర్సిటీ నుంచి దూర విద్యలో చదివిన డిగ్రీ ధ్రువపత్రం చూపించారు. ఇప్పటికీ బొల్లా చేసే ఏ ఆరోపణకైనా ఆధారాలు చూపిస్తే చీఫ్‌విప్ జీవీ ఆంజనేయు లు, తాను చర్చకు సిద్ధమని, లేదంటే బొల్లా తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. సొసైటీ చైర్మన్ పెసల వెంకటనారాయణ, సొసైటీ చైర్మన్ తిరుమల శెట్టి బాలయ్య, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.(Story : ఆధారాలు ఉంటే ఎవరిపై అయినా చర్యలు తీసుకుంటాం )
