మున్సిపల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సూచనలతో సోమవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు జాషువ కళా ప్రాంగణం నందు అంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి సౌజన్యంతో స్వచ్ఛతా హి సేవ లో భాగంగా మున్సిపల్ ప్రజారోగ్య మరియు ఇంజినీరింగ్ సిబ్బంది కొరకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ నందు రమేష్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు సురేష్ యూరో & కిడ్నీ సెంటర్ వారు పారిశుధ్య కార్మికులు మరియు ఇంజినీరింగ్ సిబ్బంది కి, కార్డియాక్, యూరో,కిడ్నీ, డే ర్మల్, షుగర్,బీపీ,బ్రెస్ట్ మరియు సర్వైకల్ క్యాన్సర్, అర్థోపెడిక్, తదితర పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. శానిటేషన్ సిబ్బందికి వైద్య పరీక్షలు తప్పనిసరి అని,ఈ వైద్య పరీక్షల ఏర్పటుకు సహకరించిన బ్యాంక్ సిబ్బంది మరియు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్యాంప్ లో మున్సిపల్ కౌన్సిలర్ షకీలా దస్తగిరి , ఆంద్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుభాష్, ఆంద్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వినుకొండ శాఖ చీఫ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి , కొచెర్ల శాఖ చీఫ్ మేనేజర్ ప్రశాంత్, శావల్యాపురం బ్రాంచ్ మేనేజర్ శివకృష్ణ , శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ , స్థానిక మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. (Story:మున్సిపల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్)
