Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాముకాటుకు సకాలంలో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

పాముకాటుకు సకాలంలో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

0

పాముకాటుకు సకాలంలో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం పాముకాటుకు గురైన మహిళను సకాలంలో వైద్యులు కోటిరెడ్డి చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే పెద్ద సీతనపల్లి గ్రామంలో నివసిస్తున్న శ్యామల కన్నయ్య కుమార్తె శ్యామల. రత్తమ్మ (35) సోమవారం సుమారు ఒంటిగంటకు పెద్ద సీతనపల్లి గ్రామంలో త్రాచు పాము కాటేసింది. అచటి నుండి నరసింగపేట సోకులేరు వరకు ఇద్దరు యువకులు మోటార్ సైకిళ్ల పై తీసుకొచ్చారు. అచట సౌకిలేరు ఉదృతంగా ఉండడంతో నాటు పడవ ఇవతలకు చేర్చారు. అనంతరం ఒక ఆటోలో ఎర్రంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి రాగానే సూపర్ని డెంట్ డాక్టర్ కోటిరెడ్డి సకాలంలో అత్యవసర అత్యవసరవైద్యం చేసి ప్రాణాలు కాపాడారు. ప్రాణాలు కాపాడిన కోటిరెడ్డి ని పలువురు అభినందించారు.సోకులేరుపై బ్రిడ్జి నిర్మించాలి. బిజెపి మాజీ మండల అధ్యక్షులు డివిఎస్ రమణారెడ్డి( చిట్టిబాబు ) డిమాండ్ కొల్తూరు గ్రామం నుండి పెద్ద సీతనపల్లి గ్రామానికి మధ్యన గల సౌకిలేరు పై గత ఏడాది సుమారు రెండున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంజూరైనా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని, సకాలంలో బ్రిడ్జి నిర్మిస్తే వైద్య సౌకర్యంతో పాటు విద్యార్థులకు విద్యా సౌకర్యం కలుగుతుందని, అలాగే తులసిపాక గ్రామం నుండి బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత రోడ్డను పునర్ నిర్మాణం చేపడితే రెండు మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్రజా ఉపయోగాల దృష్ట్యా వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.(Story :పాముకాటుకు సకాలంలో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version