Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఘనంగా  జాషువా జయంతి ఉత్సవాలు

వినుకొండలో ఘనంగా  జాషువా జయంతి ఉత్సవాలు

0

వినుకొండలో ఘనంగా  జాషువా జయంతి ఉత్సవాలు

న్యూస్ తెలుగు /వినుకొండ : జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సవాలు వినుకొండలోని జాషువా కళా ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాన వక్తగా డాక్టర్ ఖాసిం ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విశిష్ట అతిథిగా జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు జిల్లా పెనుగొండ లక్ష్మీనారాయ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుల, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గుంటూరు నల్ల వెంకటేశ్వరరావ, ప్రముఖ రంగస్థలం కళాకారులు తదితరులు పాల్గొన్నారు. చిలకల జాన్ సుందర్ రావు అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన శ్రీమతి షకీలా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త డాక్టర్ ఖాసిం మాట్లాడుతూ. ఒక ప్రాంతంలో ఒకవైపు ఆకులు ఆకునై కొమ్మలో కొమ్మనై అంటూ ప్రకృతి మీద కవిత్వం నడుస్తుంద, మరోవైపు ప్రేయసి మీద ఆమె ముని వేళ్ళ మీద కవిత్వం నడుస్తుంది, పురాణాల పైన దేవుళ్ళ పైన సనాతనమే సమాజ హితంగా కవిత్వం నడుస్తుంద. మరోవైపు కమ్యూనిస్టు భావాజాలం గల అభ్యుదయ కవిత్వం వచన కవిత్వం నడుస్తున్నద. ఈ సమయంలో వినుకొండలో గుర్రం జాషువా వినుకొండలో పుట్టి అంటరానితనాన్న, పేదరికాన్ని తన గురువుగా ఎంచుకొని సంస్కృతం నేర్చుకుని గబ్బిలాన్ని కదా వస్తువుగా ఎంచుకొని పండితుల పద్య కవిత్వంలోని గబ్బిలాన్ని కదా వస్తువుగా ఎంచుకొని పండితుల మధ్య కవిత్వంలోనే హిట్ అయిన కవిత్యాన్ని సమాజంలోని అసమానతలను ఎత్తుచూపుతో వెయ్యల తెలుగు సాహిత్యంలో నిప్పు కనికలాగా ఉద్భవించాడ. ముసలవాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగురు కుమారులు మరి పంచమ జాతి పుట్టుటకు మూలమేమిటి అని జాషువా ప్రశ్నిస్తే, ఈరోజుకి సమాధానం చెప్పిన వారు లేరు అన్నార. దూరంగా నెట్టివేస్తే వాని రెక్కలు కస్తాంబు లేని నాడు సస్యరము పండుటాకు సుశీరంబు చివరికి గుడిలోని దేవుడికి నైవేద్యం కూడా కరువైనదని జాషువా చమత్కరించిన వైనాన్ని కాసిం వివరించార. శాసనసభ్యులు ఆంజనేయులు వినుకొండలో డిజిటల్ లైబ్రరీ మరియు అంబేద్కర్ భవన్ త్వరలో నిర్మించే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు.. జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ. జాషువా అందరివాడు మా తాత గురించి, ఈ పల్లెల గురించి, ఇక్కడ వాతావరణం గురించి, ఉమ్మడి ఆంధ్ర శాసనసభలో తనను పలకరిస్తుంటే ఎంతో ఉద్రేక భరితంగా సంతోషంగా ఉంది అని జాషువా కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమైక్య కార్యదర్శి రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, సిహెచ్ మూర్తి, సమన్వయకర్తగా న్యాయవాది విజయ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమం చివర్లో కవులకు పురస్కారం బహుమతులు ప్రధానం చేశారు. ఈ సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి జాషువా విశిష్ట సాహితీ మరియు కళా రంగ పురస్కార గ్రహీత లు అయినా పెనుగొండ లక్ష్మీనారాయణ, నల్ల వెంకటేశ్వర్లు రావు లను పురస్కారం జాషువా సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి కమలారం, కోశాధికారి భాగవతుల రవికుమార్, టీచర్ ప్రదీప్, పిడుగు విజయ్ దేవ, లగడపాటి వెంకట్రావు, ఆయుధాన్ హనుమంత రెడ్డి, బొంకూరు వెంకటేశ్వర్లు, కేజే రమేష్, బంక ఎలైజేర్ శ్యామ్ లింకన్, పల్ల మీసాల దాసయ్య , పీవీ సురేష్, న్యాయవాదులు ఎన్ రామకోటేశ్వరరావు, సిద్దయ్య, వేదిక సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది పీజె. లూకా తదితరులు పాల్గొన్నారు.(Story:వినుకొండలో ఘనంగా  జాషువా జయంతి ఉత్సవాలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version