కొబ్బరి బొండాలతో అమ్మవారికి అలంకరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా 600 మంది కన్యలతో కుంకుమార్చన నిర్వహించారు. సోమవారం ఆలయంలోని మూలవిరాట్ అయిన గర్భగుడిలో అమ్మవారికి రంగురంగుల కొబ్బరి బోండాలతో అలంకరించారు. కళ్యాణ మండపం నందు ప్రత్యేక అలంకారం శ్రీ శాకాంబరీ దేవిగా తీర్చిదిద్దార. పాత శివ శివాలయం నుండి నీటిని 108 మంది మహిళా భక్తులు బిందెలతో ఊరేగింపుగా పట్టణంలో ప్రదర్శన అమ్మవారి అభిషేకానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాట్లు, ఆలయ కమిటీ వారిచే ప్రత్యేక హోమాలు, ప్రతిరోజు మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కమిటీ వారు మాట్లాడుతూ. వచ్చే నెల 2వ తారీకు వరకు నవరాత్రి ఉత్సవాల ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ వారు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఉత్సవాలకు పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని అన్నారు. 10 రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమం నందు ప్రతిరోజు కుంకుమ పూజ, చండీ హోమాలు, పండుగ నాడు సెమీ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జి, గౌరవ అధ్యక్షులు తాతా వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ అమర్నాథ్, రెడ్డి నగేష్ బాబు, కోశాధికారి పెండ్యాల సురేష్, కొల్లిపర వెంకట నాగేశ్వరరావు, సదావర్తి సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.(Story:కొబ్బరి బొండాలతో అమ్మవారికి అలంకరణ)

