Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పని గంటల పెంపును   విరమించుకోవాలి

పని గంటల పెంపును   విరమించుకోవాలి

0

పని గంటల పెంపును   విరమించుకోవాలి

కేశవరం బాటిలింగ్ యూనిట్ లో మంచి అగ్రిమెంట్ చేస్తాం
యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు

న్యూస్ తెలుగు/చింతూరు : పనిగంటలు పెంచుతూ అసెంబ్లీ లో ఆమోదించడంపై నిరసిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, కేశవరం బాటిలింగ్ యూనిట్ లో వచ్చే నూతన అగ్రిమెంట్ బాగా చేస్తామని కార్మికుల హక్కులు కాల రాస్తే సహించేది లేదని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు, కేశవరం బాటిలింగ్ యూనిట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు.
ఆదివారం ఉదయం స్థానిక రాజవోలు గుడి వద్ద యూనియన్ జనరల్ బాడీ సమావేశం అధ్యక్షులు
గారపాటి రామారావు అధ్యక్షతన జరిగింది.

 మధు మాట్లాడుతూ..
ఉద్యోగుల కార్మికులపై పనిభారం మోపెందుకే పని గంటల పెంపు అని, పని గంటల పెంపుదల తక్షణమే విరమించుకోవాలని, కార్మికుల,ఉద్యోగుల ఆధ్వర్యంలో ఉద్యమిస్తూ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. పని గంటల పెంపుదల కార్పొరేట్ వ్యక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు అదాని, అంబానీలకు లాభం చేకూర్చేందుకు, వారికి కొమ్ముకాస్తూ కార్మికుల రక్తమాంసాల శ్రమను దోచి పెట్టేందుకే, ఈ రాష్ట్ర ప్రభుత్వం పని గంటల్లో పెంపుదల చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగాలను ఒక్కొక్క రంగాలుగా ప్రైవేటీకరణ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నతిద్ధమవుతుందని, ఎనిమిది గంటల పని దినాలు కార్మిక చట్టంలో ఉన్న హక్కులని, 8 గంటల పని దినాలు అమలకు ఎన్నో పోరాట ప్రాణ త్యాగాలు చరిత్ర ఉన్నదన్నారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పని గంటల పెంపు దినులను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేకుంటే చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుంటే పని దినాలు పెంచుతుంటే అసెంబ్లీ సమావేశాల్లో వారి ఓట్లతో నెగ్గిన ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు వ్యతిరేకించలేదని, వ్యతిరేకించలేని ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలని ఆయన అన్నారు. పని గంటల పెంపుదలపై పరిశ్రమంలో పనిచేస్తున్న ప్రతి కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పని గంటల పెంపుదలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని, పని గంటలు పెంపుదలను వ్యతిరేకించకపోతే భవిష్యత్తు అందాకారం అవుతుందిని అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి డి రాంబాబు, ఎస్ మరిడయ్య, బి రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (Story:పని గంటల పెంపును   విరమించుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version