ప్రజల సొమ్ము కందకం పాలు ప్రజలేమో రోగాల పాలు
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 10, 21 వ వార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ పరిశీలించిన ఐక్యవేదిక సభ్యులు. ఈ సందర్బంగా ఐక్యవేదిక అధ్యక్షులు డా” సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 21వ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారు. మిగతాది ఆసంపూర్తిగా ఉండి, పిచ్చి మొక్క లు మొలవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నిర్మాణంలో ఉన్న ఐరన్ కడ్డీలను దొంగలు దొంగలిస్తున్నారని, ప్రజల సొమ్ము దొంగలు, కాంట్రాక్టర్లు దోచుకుపోతున్నారని,రాత్రి అయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అంతేకాక ఈ నిర్మాణం పూర్తయితే రోడ్లపై ఉన్న కూరగాయల మార్కెట్ మొత్తాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారని ఆశించిన ప్రజలు అవి ఆగిపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు అయిందని, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోకపోవడంతో అక్కడ పిచ్చి మొక్కలు మొలకెత్తి పాములు, తేళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయని అలాగే కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల పాలు అవుతున్నారని గెలిచిన ప్రజాప్రతినిధులు కనీసం పిచ్చి మొక్కలు కూడా తీపియలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఏ పని కూడా చేయలేని దద్దమ్మలకు రాబోవు ఎలక్షన్లలో మళ్ళీ ఓటు వేస్తారా? ఇది కాంట్రాక్టర్ తప్ప? ప్రభుత్వం తప్ప? వార్డు ప్రజలు గెలిపించుకున్న కౌన్సిలర్ అధినాయకుడి వెంట జిల్లా మొత్తం తిరుగుతాడు, కానీ తన వార్డు లో ఉండే సమస్యలను మాత్రం కన్నెత్తి చూడడు. వార్డు ప్రజలు ఫోన్ చేసిన స్పందించడు. ప్రజల బాగోగులు చూడని సన్నాసులను ఓడించాలని సతీష్ యాదవ్ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, రామస్వామి, కురుమూర్తి, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.(Story : ప్రజల సొమ్ము కందకం పాలు ప్రజలేమో రోగాల పాలు )
