Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సిపిఐ ఆధ్వర్యంలో ”గుర్రం జాషువా” జయంతి వేడుకలు

సిపిఐ ఆధ్వర్యంలో ”గుర్రం జాషువా” జయంతి వేడుకలు

0

సిపిఐ ఆధ్వర్యంలో ”గుర్రం జాషువా” జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడితో నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా వర్ణ వివక్ష, కుల నిర్మూలన కోసం ప్రజా చైతన్యం కోసం అనేక రచనలు చేశారని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని గుర్రం జాషువా ప్రాంగణంలోని ఆయన విగ్రహం వద్ద సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. ఫిరదౌసి, గబ్బిలం, క్రీస్తు చరిత్ర లాంటి అనేక ప్రతిష్టాత్మకమైన రచనలు చేసిన జాషువా పురస్కారాలు, బిరుదులు పొందారని, కులానికి సంబంధించిన మొదటి మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అని ఆయన అన్నారు. గబ్బిలం కావ్యంలో వర్ణ వివక్షకు గురైన ఒక మనిషి తన బాధను గబ్బిలం ద్వారా గర్భగుడి లోపల ఉన్న భగవంతునికి తెలియజేసే తన ఆవేదన చదువరులకు కంటతడి పెట్టిస్తుందని ఆయన వివరించారు. శాసనమండలి సభ్యులుగా ప్రజలు సమస్యలను ఆనాటి ప్రభుత్వ దృష్టికి తెచ్చిన నాయకుడని ఆయన కవిత్వం సామాజిక స్పృహ మానవత్వం మరియు దేశభక్తిని ప్రతిబింబిస్తుందని అటువంటి మహనీయుని ఆశయాలు సమాజంలో కులమతాలకు అతీతంగా ప్రజలు అందరూ సమానంగా బ్రతకాలని మహా మనిషి జాషువా భావించారని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం భారతదేశ నవ సమాజ నిర్మాణం కోసం యువతి, యువకులు అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఐ నూజెండ్ల మండల కార్యదర్శి ఎ. పవన్ కుమార్, వినుకొండ మండల కార్యదర్శి కె. మల్లికార్జునరావు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి దారి వేముల, బాబు, చింతపల్లి రవి, సోడాల సాంబయ్య, షేక్ మీరావాలి, కరీముల్లా, జల్లి వెంకటేశ్వర్లు, గురుస్వామి నాగి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.(Story:సిపిఐ ఆధ్వర్యంలో ”గుర్రం జాషువా” జయంతి వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version