Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 జయంతి

 ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 జయంతి

0

 ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 జయంతి

భగత్ సింగ్ స్ఫూర్తితో మత్తు పదార్థాలపై ఉద్యమిస్తాం

ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి దారి వేముల మరియబాబు

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గంలోని సిపిఐ కార్యాలయంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు, నేటి యువతకు మార్గదర్శి, స్ఫూర్తిదాయకుడు సర్దార్ భగత్ సింగ్ 118 వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి దారి వేముల మరియ బాబు మాట్లాడుతూ. స్వాతంత్ర ఉద్యమ ధృవతార భగత్ సింగ్ స్పూర్తితో నవయువ భారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైందని అటువంటి యువత నేడు మాదక ద్రవ్యాలకు బానిసలై యువ శక్తి నిర్వీర్యం అవ్వడం దేశ ప్రగతికి విఘాతం కలుగుతుందని ఏఐవైఎఫ్ నాయకులు అన్నారు. స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల కు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ తరుణంలోనే భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యువజన చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు పరచాలని దేశవ్యాప్తంగా ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కృషి చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్ రవి, షేక్ సుభాని, ఎస్.కె. మస్తాన్, మంద మోషే, మంద చిన్న స్వామి, భాస్కర్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు. (Story: ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 జయంతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version