ఆట్యా- పాట్యా ఉమెన్ విభాగంలో వినుకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ద్వితీయ స్థానం
న్యూస్ తెలుగు/వినుకొండ : ఈనెల 25 నుండి 27 వరకు పల్నాడు జిల్లా నకరికల్లు జడ్పీ హైస్కూల్లో జరిగిన 12వ అంతర్ జిల్లాల ఆట్యా- పాట్యా మెన్ అండ్ ఉమెన్ విభాగంలో వినుకొండ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ కు చెందిన డి.రాజినాభి, శ్రీలక్ష్మి, పుష్ప ప్రియ విద్యార్థినీలు గుంటూరు జిల్లా తరఫున ప్రతిభ కనబరిచి, 12వ రాష్ట్రస్థాయి ఆట్యా- పాట్యా 2025 ఛాంపియన్ షిప్ పోటీలలో ద్వితీయ, గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం (బ్రింగ్ మెడల్) సాధించినట్లు గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి. శైలజ కుమారి తెలిపారు. ఈ సందర్బంగా క్రీడాకారులను శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయురాలు రూత్ మేరీ, డి. మనీ, రేణుక, ప్రధానోపాధ్యాయురాలు లను బి శైలజ కుమారి పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.(Story:ఆట్యా- పాట్యా ఉమెన్ విభాగంలో వినుకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు ద్వితీయ స్థానం)
