నీళ్ల నిరంజనుడి ముందస్తు ప్రణాళికతో నాటి మొండికుంట
న్యూస్ తెలుగు/వనపర్తి :శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు ఆధునీకరించిన లక్ష్మికుంట సమృద్ధిగా కురిసిన వర్షాలతో అలుగుపారుతున్న సందర్భంగా రైతులు,బి.ఆర్.ఎస్ నాయకుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ లక్ష్మికుంట చెరువును చేరుకొని అలుగు పారుతున్న గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీనివాసపూర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు చిన్న కుంటగా ఉండి ఎటువంటి మరమత్తులు లేకుండా నిరుపయోగంగా ఉండడంతో అనాడు రైతులు ఈ కుంటను అభివృద్ధి చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫారెస్టులోని జీవరాశులకు సౌలభ్యంగా ఉంటుందని కోరగా స్పందించిన తాము ఒక బృహత్తర ప్రణాళికతో అటవీశాఖ అనుమతులు సాధించి నాటి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారి సహకారముతో చిన్నగా ఉన్న మొండికుంటను ఆధునీకరించి లక్ష్మికుంటగా నామకరణం చేయడం జరిగింది అని అన్నారు. దాదాపు 4కిలోమీటర్ల దూరములో ఉన్న ఈదుల చెరువు నుండి లిఫ్ట్ ద్వారా ఎత్తిపూసి రెండు సంవత్సరాలు నింపడం జరిగిందని ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి అలుగు పారడం సంతోషాదయకం అని అన్నారు. ఈ లక్ష్మికుంటతో దాదాపు 400బోర్లు రీఛార్జ్ అవుతూ 650 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ లోని అటవీ జీవరాశులు కుందేలు,నెమళ్ళు,దుప్పులు,నెమళ్ళు వంటి జంతువులుకు నీటి సౌకర్యం కలగడంతో అటవీ సంపద కూడా పెరుగుతుందని అని అన్నారు. ఈ సందర్భంగా రైతులు,నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,గంధం.పరంజ్యోతి,దేవర్ల.నరసింహ,చిట్యాల.రాము,బాలకిస్టి,బాబు నాయక్, భరత్, సిరివాటి.శంకర్,ఎల్లస్వామి, సేవ్యా నాయక్,కంచ.నిరంజన్,శరత్ బాబు, పాసుల.సురేష్,పోలికల.సుధాకర్, జానంపేట.శ్రీను,బాగ్యరాజు,విజయ్ సాగర్,లక్ష్మణ్ గౌడ్, శివ గౌడ్,కరుణాకర్,మునికుమార్,ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.(Story : నీళ్ల నిరంజనుడి ముందస్తు ప్రణాళికతో నాటి మొండికుంట )
