Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలి

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలి

0

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలి

తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
తహసిల్దార్ సురేష్ నాయక్ కి మెమో రాండం ప్రజాసంఘాలు ,వామపక్షాలు

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, కారంపూడి మండలం, పెద్ద కొదమగుండ్ల గ్రామ పరిధిలోని కాకాని వారి పాలెం గ్రామానికి చెందిన దళిత యువకుడు వర్ల సాగర్ బాబు, కారంపూడి మండల విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వలన విద్యుత్ షాక్ కు గురై ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి కాళ్లు రెండు చచ్చుబడి పూర్తి వికలాంగుడిగా మారాడని, ఈ విషయం మీద విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకొని సాగర్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గత నాలుగు నెలలుగా సంబంధిత జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులకు అర్జీలు ఇచ్చిన నేటికి ఎలాంటి చర్య లేకపోవడంతో గత 14 రోజుల నుండి సాగర్ బాబు తన కుటుంబం చేజర్లలో నిరవధిక దీక్షలకు కూర్చున్నారని, ఆయన చేసే దీక్షలకు న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా ప్రజాసంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం వినుకొండ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలని తహసిల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసిల్దార్ సురేష్ నాయక్ కి అర్జీవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడిఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు షేక్ మస్తాన్వలి, జి రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రెడ్డి పోయిన ప్రసన్నకుమార్, సిపిఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు బొంకూరు వెంకటేశ్వర్లు, మాల మహానాడు నాయకులు విజయ్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్, రైతు నాయకుడు ఘనపర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.(Story :విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన సాగర్ బాబు కుటుంబాన్ని ఆదుకోవాలి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version