Home వార్తలు తెలంగాణ దొరల పాలనకు చరమగీతం పాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

దొరల పాలనకు చరమగీతం పాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

0

దొరల పాలనకు చరమగీతం పాడిన వీరవనిత చాకలి ఐలమ్మ

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ ఉద్యమకారిణి వీరవనితా తొలి భూ పోరాటానికి నాంది పలికినా ధెైర్యశాలి చాకలి ఐలమ్మ అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు పేర్కొన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె వీరత్వాన్ని ఆయన మననం చేసుకున్నారూ. ఈసందర్భంగా ఆయన వనపర్తి పట్టణం బస్టాండ్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ప్రథమరాలు అనీ ఆయన అన్నారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, GJ శ్రీనివాస్, లక్కాకుల సతీష్, మాజీ కౌన్సిలర్లు, వెంకటేష్, చీర్ల సత్యం, బ్రహ్మంచారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ట, శ్రీహరి రాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : దొరల పాలనకు చరమగీతం పాడిన వీరవనిత చాకలి ఐలమ్మ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version