Home వార్తలు తెలంగాణ భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి

భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి

0

భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి

న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం అందరికి స్ఫూర్తి దాయకమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్, ఎమ్మెల్యే నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం అందరికి స్ఫూర్తి దాయకమని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ అన్ని వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ధీరవనిత అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్దీన్ ఖాన్, సామాజికవేత్త రాజా రామ్ ప్రకాష్, రజక సంఘం జిల్లా నాయకులు బండలయ్య, ఇతరులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, రాజు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.(Story : భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వీరనారి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version