ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను
భర్తీ చేయాలి
నిరుద్యోగ భృతి అమలు చేయాలి
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు డిమాండ్
న్యూస్ తెలుగు /వినుకొండ : అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ బుధవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మరియు గ్రూప్ – 1,2 నోటిఫికేషన్ విడుదల చేయాలని, అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి 18 నెలలు దాటిన ఇంతవరకు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం దారణమని అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మరియు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి తక్షణమే అందించాలని, నిరుద్యోగులు అందరికీ వివిధ నోటిఫికేషన్లకు ఉచితంగా శిక్షణ అందించాలని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై దశల వారీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు అంజిరెడ్డి, మరియబాబు, పొట్టి పోగు సైదారావు, దయాకర్, అవినాష్, హర్షవర్ధన్, దేవరకొండ గోపి, యు.రాజు, కొయ్య శీను తదితరులు పాల్గొన్నారు. (Story:ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి)

