ర్యాంకులు సాధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకొన్న విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించిన ఏపిపిజిసిఈటి – 2025 లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి వివిద విశ్వ విద్యాలయాలలో ప్రవేశాలు పొందారు. ఆంధ్రా యూనివర్సిటీ లో ఇద్దరు , శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 14 మంది , యోగి వేమన విశ్వవిద్యాలయం లో ముగ్గురు , ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఐదు మంది. మొత్తం 24 మంది ప్రతిష్టాత్మక మైన విశ్వవిద్యాలయాలలో ఎం.కామ్, ఎం. ఎస్సి. కెమిస్ట్రీ, ఎం.స్సీ కంప్యూటర్ సైన్స్ విభాగాలలో ప్రవేశాలు సాధించారు.. ఈ సందర్భంగా బుధవారం కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కొల్లు శ్రీనివాస రావు, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.(Story:ర్యాంకులు సాధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు)

