సిరిమాను చెట్టును దర్శించిన మన సిరమ్మ
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : గంట్యాడ మండలం, కొండతామరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవంలో భాగంగా సిరిమాను చెట్టును దర్శించిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ.జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తెచిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ బుధవారం పాల్గొని సిరిమానుకు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ పూజారి స్వాగతం పలికి , తదనంతరం వేద పండితులు ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీపైడితల్లమ్మ చల్లని కరుణ ఉత్తరాంధ్ర ప్రజల పై ఉండాలని కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story:సిరిమాను చెట్టును దర్శించిన మన సిరమ్మ)

