బెల్ట్ షాపులు పై ఎక్సైజ్ శాఖ దాడులు
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ఐటిడిఏ పిఓ శుభం నొక్వాల్ ఫిర్యాదు మేరకు చింతూరు ఎక్సైజ్ శాఖ అధికారులు ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో చర్చి ఎదురుగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న కొప్పు అలివేలు అనే మహిళ షాపు వద్ద 50 మద్యం సీసా లను చింతూరు ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎల్లిపాక గ్రామంలో ప్రజల ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులు మొరం పల్లి చందర్రావు, చింత ఏడుకొండలు, బోమ్మగానే నాగేశ్వరరావు అనే వ్యక్తుల వద్ద 95 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, విజయలక్ష్మి, ఎస్సై స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. (Story:బెల్ట్ షాపులు పై ఎక్సైజ్ శాఖ దాడులు)
