సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
న్యూస్ తెలుగు/సాలూరు : రైతులు వ్యవసాయ సాగు విధానాలను ఏ గ్రేట్ మోడల్, ఏటీఎం మోడల్ సాగు విధానంలో పంటల్లో అంతర్ పంటలు వేసినట్లయితే అధిగ దిగుబడులు సాధించవచ్చని సాలూరు వ్యవసాయ అధికారి కే శిరీష అన్నారు మంగళవారం సాలూరు మండలంలో గల అన్నంరాజువలస మరియు మామిడిపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి ఆమె ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ నూతన సాగు విధానాలు అయిన ఏ గ్రేడ్ మోడల్ మరియు ఏటీఎం మోడల్ వ్యవసాయ విధానములు వివరిస్తూ ఏ గ్రేడ్ మోడల్ సాగు లో ప్రధాన పంటలతో పాటు అంతర పంటగా వివిధ రకాల కాయగూరలు సాగు చేయడం మరియు ఏటీఎం మోడల్ సాగు విధానం లో ప్రతిరోజూ రైతులకు ఆదాయం వచ్చే విధంగా వివిధ రకాల కూరగాయల సాగు విధానాలు రైతులకు వివరించడం జరిగింది అలానే రైతుల పొలాలు పరిశీలించడం జరిగింది, రైతులకు నానో యూరియా మరియు నానో డిఏపి ఎరువుల వినియోగం డ్రోన్ ద్వారా పంటలకు పిచికారీ చేయడం వలన పంటలకు తగిన మోతాదులో ఎరువులు వినియోగించడం జరుగుతుందని తద్వారా యూరియా అధికంగా వాడకం వలన కలిగే చీడ పీడలు సమస్య నుండి పంటలను కాపాడుకోవచ్చని తెలియ చేశారు ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ సాగు సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. (Story :సాలూరు మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం)
