దసరాకు ఊరెళ్తున్నారా? భద్రం
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి :
దసరాకు ఊరెళ్లేవారు జాగ్రత్త. సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించండి. మీ సమాచారం స్థానిక పోలీస్టేషన్లో ఇవ్వండి అని విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టడం మంచిదని ఇంటి తాళాలు మీతో పాటే తీసుకెళ్లండని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఎక్కువ రోజులు ఊరెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారమివ్వండి అని ఆయన చెప్పారు. ఇంటి తాళాలు పూలకుండీలు, షూ రాక్స్, డోర్ మ్యాట్స్ కింద పెట్టొద్దు అని, ఇంటి తాళాలు, విలువైన వస్తువులను మీ వెంటే తీసుకెళ్లండి అని ఆయన సూచించారు. వాహనాలను ఇంటి ఆవరణలో పార్క్ చేయండి అని,
వాహనాల డిక్కీల్లో విలువైన వస్తువులను పెట్టకండి అని ఆయన సూచించారు. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి అని ఆయన అన్నారు.
ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ ద్వారా తరచూ పరిశీలించండి అని,
DVR కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో పెట్టండి అని,
ఊరేళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు అని సూచించారు. కొత్త వ్యక్తుల కదలికలను గుర్తిస్తే తక్షణమే 100 డయల్ చేసి సమాచారం ఇవ్వండి అని ఆయన సూచించారు. పోలీసులతో సమన్వయం ద్వారా చోరీల నియంత్రణ సులభం అవుతుందని ఎస్పీ తెలిపారు.(Story:దసరాకు ఊరెళ్తున్నారా? భద్రం )
