Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సామూహిక మహాలయ అమావాస్య పితృతర్పణాలు

సామూహిక మహాలయ అమావాస్య పితృతర్పణాలు

0

సామూహిక మహాలయ అమావాస్య పితృతర్పణాలు

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన గల అపర కర్మల సత్రమునందు వినుకొండ ప్రాంత ప్రజల కోసం వినుకొండ పట్టణ పురోహితులు పురోహిత సామ్రాట్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో సామూహిక పితృ తర్పణాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పుర ప్రముఖులు సద్వినియోగపరుచుకున్నారు. పిత్రుకర్మల ఆచరించడం ద్వారా వంశాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి మరియు సర్వ ఆటంక నివారణలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ పితృకర్మాచరణ చేయాలని తెలిపారు. మహాలయ అమావాస్య రోజు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు చేసి అన్నసంతర్పణ చేసిన వారికి పెద్దల ఆశీస్సులు మెండుగా ఉంటాయని, ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం శ్రీ జయవరపు రామచంద్ర రావు చే నిర్మింపబడిన అపర కర్మల వసతి భవనము నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారికి పట్టణ పురోహితులు అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.(Story : సామూహిక మహాలయ అమావాస్య పితృతర్పణాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version