Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండ ఆర్టీసీలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

వినుకొండ ఆర్టీసీలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

0

వినుకొండ ఆర్టీసీలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు స్థానిక ఆర్టిసి గ్యారేజీలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ జె. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు శ్రమదానం చేపట్టి పరిసరాలను శుభ్రపరిచారు. గ్యారేజీ ఆవరణలో పలు రకాల మొక్కలు నాటి ఆహ్లాద వాతావరణం కల్పించారు. అలాగే బస్టాండ్ ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తా లేకుండా ఆయా ప్రాంతాలను శుభ్రపరిచి బస్టాండ్ ఆవరణలో ఉన్న కూల్ డ్రింక్ షాప్స్, కొబ్బరి బోండాల దుకాణాలు పరిశీలించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్టిఐ ధనలక్ష్మి, డిఎం కార్యాలయ సిబ్బంది, గ్యారేజ్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.(Story:వినుకొండ ఆర్టీసీలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version