Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు

పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు

పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు

అసత్య ప్రచారాలు ఆపకపోతే బొల్లాపై పరువునష్టం దావా
వినుకొండ అభివృద్ధి, వరికెపూడిశెల ప్రాజెక్టుపై చర్చకు సిద్ధం
వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ

న్యూస్ తెలుగు /వినుకొండ :రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలుసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని, అందు కే వారి సంక్షేమం కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్‌విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా ప్రభుత్వంలో వారిని గాలికి వదిలేశారని, కనీసం మాస్క్‌, గ్లౌజ్‌ కూడా ఇవ్వలేదన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికుల్లో శాశ్వత ఉద్యోగులకు రూ.కోటి బీమా, రూ. పది లక్షల జీవిత బీమా, 33 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నామని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు,ఔషధాలు అందిస్తున్నామన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా వారికి బట్టలు, మాస్క్‌లు, గ్లౌజ్‌లు అందించాలని నిర్ణయించాం. త్వరలోనే అందిస్తామన్నారు. శాశ్వత కార్మికుల తరహాలోనే ఒప్పంద కార్మికులకు కూడా వస్త్రాలు, ఇతర సామాగ్రి అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగానే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీవి మాట్లాడుతూ. అక్కడ ప్రధాని మోదీ స్వచ్చతాహీ సేవకు, ఇక్కడ చంద్రబాబు స్వచ్ఛాంధ్రకు పిలుపునిచ్చి ఎంతో బాగా అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి 86లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎక్కడికక్కడ వదిలేసి పోతే, దానికి శుభ్రం చేయడంతో పాటు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నా మన్నారు చీఫ్‌విప్ జీవీ. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్నామన్నారు. కొత్తగా డంపింగ్ యార్డ్‌లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నాన్నట్లు తెలిపారు. జగన్ చేసిన రూ.10లక్షల కోట్ల అప్పులు తీర్చుతునే సూపర్‌ సిక్స్ పథకాలు అందిస్తున్నామని, సంక్షేమ పథకాల్లో ఏపీని దేశంలోనే నెంబర్‌-1 స్థానంలో నిలిపిన సమర్థ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నాగశ్రీను రాయల్ , మేడం రమేష్, బొంకూరి రోశయ్య, పెమ్మసాని నాగేశ్వరరావు, షమీంఖాన్, పి దాసయ్య, వై.కోటేశ్వరరావు, షకీలా దస్తగిరి, గుడిపాటి చంద్రశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, ఆసుపత్రి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

*వరికెపూడిశెలను పూర్తి చేస్తాం:..

వరికెపూడిశెల ప్రాజెక్టుకు 1925కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చీఫ్‌విప్ జీవీ కచ్చితంగా రానున్న రోజుల్లో అది పూర్తి చేస్తామమన్నారు. పర్యావరణ అనుమతులకు కట్టాల్సిన డబ్బు కూడా చెల్లిస్తామన్న జీవీ ఆ ప్రాజెక్టుకు పైసా డబ్బులు తేలేని, ఇటుక కూడా పెట్టని మాజీ ఎమ్మెల్యే బొల్లా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గురువింద గింజకు కింద నలుపు తెలియదు అన్నట్లు బొల్లా ప్రవర్తిస్తున్నారని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.

బొల్లా విషప్రచారాలపై పరువునష్టం దావా:

మాజీ ఎమ్మెల్యే బొల్లా ఇంకా అదుపు తప్పితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా కూడా వెయ్యాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోజురోజుకీ దిగజారి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వెధవల్ని వినుకొండ ప్రజలు చాలామందిని చూశార న్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని… వినుకొండ లో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు.(Story:పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి సీఎం చంద్రబాబు)

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!